Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మలేని లోటును దిగమింగి... 'ధడక్' షూటింగ్‌కు జాన్వీ కపూర్

అందాల నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేస్తోంది. ఈమె నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ధడక్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (10:25 IST)
అందాల నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేస్తోంది. ఈమె నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ధడక్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే గత నెల 24వ తేదీన నటి శ్రీదేవి హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ వార్తతో బోనీ కపూర్ కుటుంబం షాక్‌కు గురైంది. ఈ విషాదం నుంచి కపూర్ ఫ్యామిలీ మెల్లగా కోలుకుంటుంది. 
 
ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును జరుపుకున్న జాన్వీ, సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని మాట ఇచ్చిందట. 
 
కాగా, 'ధడక్' ప్రస్తుత షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్‍ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీరిద్దరూ కోల్‍కతాలో జరిగే షూటింగ్‍లో పాల్గొంటారని తెలుస్తోంది. సూపర్21హిట్ అయిన మరాఠీ చిత్రం 'సైరాత్' హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments