Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యవాణికి మద్దతిచ్చిన శ్రీరెడ్డి.. వాడుకుని వదిలేస్తారని చెప్పానుగా..

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (19:14 IST)
నటి దివ్యవాణిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. నటి దివ్య వాణి టీడీపీకి గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో శ్రీరెడ్డి టీడీపీపై ఫైర్ అయ్యింది.

టిడిపి పార్టీ నేతలు తనను ఎదగనీయకుండా చేశారని టీడీపీ అధినేతకు మనసాక్షి లేదంటూ తీవ్రస్థాయిలో దివ్యవాణి మండిపడిన సంగతి తెలిసిందే. 
 
ఇలాంటి పరిస్థితుల్లో దివ్యవాణికి మద్దతుగా శ్రీరెడ్డి నిలిచింది. నటి దివ్యవాణికీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ముందే చెప్పాను అంటూ చెప్పింది శ్రీరెడ్డి.
 
టిడిపి పార్టీ నేతలకు వాడుకొని వదిలేయడం అలవాటే.. ఇప్పటికైనా దివ్యవాణి కళ్ళు తెరవాలి అంటూ హితవు పలికింది శ్రీ రెడ్డి. 
 
అయితే దివ్యవాణి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడో చెప్పానని, అలాగే టిడిపి పార్టీ వాళ్లు మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి వదిలి పెడతారు అని చెప్పానని, డబ్బులు సంపాదించడం మాట పక్కన పెడితే పార్టీలోకి వెళ్లిన తర్వాత సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ముందే చెప్పాను అని తెలిపింది శ్రీరెడ్డి. 
 
దివ్యవాణిని ఉద్దేశిస్తూ.. మీరు మీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇరగొట్టేశారు. అది తనకు చాలా బాగా నచ్చింది. మనసుకు చాలా తృప్తిగా ఉంది అని తెలిపింది శ్రీరెడ్డి. కేవలం మీరే కాదు ఇది వరకు సాధినేని యామిని లాంటి వాళ్లు కూడా టీడీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్లే అని తెలిపింది శ్రీరెడ్డి. 
 
అనంతరం ఇంకా శ్రీరెడ్డి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌గారు పెట్టిన పార్టీ కాబట్టి తనకు టిడిపి మీద గౌరవం ఉంది. కానీ కొంతమంది పార్టీలకు వచ్చి ఆ పేరును చెడగొట్టారు అని తెలిపింది శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments