Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి మద్దతు.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అన్న అపూర్వ.. వర్మ ఏమన్నారంటే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డికి తొలుత నుంచి మద్దతిస్తున్న మరోనటి అపూర్వ... న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని తెలిపింది. సినీ పరి

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (17:27 IST)
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డికి తొలుత నుంచి మద్దతిస్తున్న మరోనటి అపూర్వ... న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని తెలిపింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై  హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ, న్యాయం కోసం అవసరమైతే, ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తామని హెచ్చరించింది. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు తాము మాట్లాడుతుంటే.. కొందరు తమను అవహేళన చేస్తున్నారన్నారు. తమకు మద్దతుగా నిలవకపోయినా ఫర్వలేదుగానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దన్నారు. 
 
మరోవైపు నటి శ్రీ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అశోక చక్రవర్తితో పోల్చారు. అశోక చక్రవర్తి ఎంతో మందిని చంపిన తరువాత వారి మృతదేహాలు చూసి కలత చెంది మారిపోయారు.

ఆ తర్వాతే ప్రజలందరినీ బాగా పరిపాలించాడని.. అలాగే శ్రీ రెడ్డి కూడా ఇంతకుముందు కొన్ని అభ్యంతర పదాలు వాడినా, కొన్ని చెడ్డ పనులు చేసినా.. ఆ తరువాత సామాజిక కార్యకర్తగా మారిపోయి, పోరాటం చేస్తుందని.. అందుకే శ్రీరెడ్డి, అశోక చక్రవర్తిలాగా చాలా గొప్పదని కొనియాడారు. అంతటితో ఆగకుండా.. చాలామంది మగవాళ్లు శ్రీరెడ్డి నిజాయితీని చూసి భయపడుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments