Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి కన్నీళ్లు పెట్టుకుందంటే ఇదేదో.. సినిమా కోసం అనుకునేరు. కానేకాదు.. రియల్ సీన్. ఫాదర్స్ సందర్భంగా ఓ ప్రోగ్రామ్‌లో అందరూ వారి తండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానిక

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (17:58 IST)
యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి కన్నీళ్లు పెట్టుకుందంటే ఇదేదో.. సినిమా కోసం అనుకునేరు. కానేకాదు.. రియల్ సీన్. ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రోగ్రామ్‌లో అందరూ వారి తండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటులు.. తమ కుమార్తెలు, కుమారులతో వచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి తనకు తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉందని చెప్పింది.
 
అమ్మే తనకు ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు కారణమైందని.. అయితే నాన్న కూడా ఇండస్ట్రీలో తన ఎదుగుదలతో పాటు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారని.. ఆయనంటేనూ తనకు ఇష్టమేనని చెప్పుకొచ్చింది. కానీ ఆ షో నిర్వాహకులు మాత్రం శ్రీముఖి తండ్రితో తీసుకున్న బైట్‌ను ప్లే చేశారు. దీంతో శ్రీముఖి సర్‌ప్రైజ్ అయ్యింది. 
 
శ్రీముఖి తండ్రి ఆ వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ... అందరూ తన కుమార్తె గురించి గొప్పగా చెప్తుంటే ఎంతో గర్వంగా వుందన్నారు. శ్రీముఖి తనకు బిడ్డగా పుట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆ మాటలు విని శ్రీముఖి భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేసింది. ఈ సీన్‌ను టీవీలో ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా ప్రసారం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments