Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం ప్రకటన

డీవీ
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (16:14 IST)
Sree Vishnu Reba Jaan
సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న హీరో శ్రీవిష్ణు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.
 
హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు  లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.  ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)

ప్రభుత్వ పరిహారం కోసం.. భర్తను హత్య చేసి పులిపై నెపం వేసిన భార్య

అప్పుల భారంతో సతమతమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు

జగన్ రాష్ట్రంలో వైద్య కాలేజీలు కట్టారా? కాస్త చూపిస్తే చూస్తామంటున్న సీఎం చంద్రబాబు

Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.25,000 కోట్ల అంచనా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments