Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం విజయ్ కావాలి : 'స్పైడర్' విలన్ ఆకాంక్ష

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్‌'లో విలన్‌గా నటించిన ఎస్.జె.సూర్య స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అయితే సంతోషిస్తానని అభిప్రాయపడ్డారు

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (11:02 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్‌'లో విలన్‌గా నటించిన ఎస్.జె.సూర్య స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అయితే సంతోషిస్తానని అభిప్రాయపడ్డారు. 
 
ఇళయదళపతి విజయ్‌ తాజా చిత్రం ‘మెర్సల్‌’. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సూర్య మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అయితే సంతోషిస్తానని చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లోకి రాకూడదన్న చట్టం లేదన్నారు. అలాగే ఫలానా వ్యక్తి మాత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టాలనే నిర్బంధం కూడా లేదని గుర్తుచేశాడు. 
 
స్వతంత్ర భారతావనిలో సమాజానికి మంచి చేయాలనుకొనే ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావచ్చని స్పష్టంచేశాడు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నాడు. అయితే, రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలని ఆయన సూచించాడు. ఇచ్చిన పనిని విజయ్ ఏకాగ్రత, నిబద్ధతతో చక్కబెట్టే వ్యక్తి అని, అందుకే రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments