Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 31న స్పైడర్ టీజర్: బాహుబలి-2 తరహాలో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు కమల్ రెడీ..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని వేయి కనులతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ తీపి కబురు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31)ను పురస్కరించుకుని స్పైడర్ టీజర్‌

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (16:34 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని వేయి కనులతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ తీపి కబురు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31)ను పురస్కరించుకుని స్పైడర్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. టీజర్‌ను రిలీజ్ చేసే పనుల్లో స్పైడర్ యూనిట్ బిజీ బిజీగా ఉంది.

దాదాపు 59 సెకన్లతో కూడిన టీజర్‌ను మురుగదాస్ సిద్ధం చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని మహేష్ సెట్స్‌పై ఉన్న ఓ సినిమా టీజర్నైనా విడుదల చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సెంటిమెంట్‌ను మురుగదాస్ ఫాలో అవుతున్నారని టాక్. 
 
ఇంకా మహేష్‌బాబు స్పై ఏజెంట్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబరులో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమలకణ్ణన్ జాయిన్ అయినట్లు సమాచారం.
 
కమలకణ్ణన్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ, బాహుబలి సినిమాలకు వంటి సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం స్పైడర్ టీమ్‌తో కమలకణ్ణన్ జాయిన్ కావడంతో స్పైడర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. స్పైడర్ క్లైమాక్స్ సీన్లు రష్యాలో షూట్ చేయనున్నారు. ఈ పనుల్లో ఆయన పాలుపంచుకుంటారని తెలుస్తోంది. బాహుబలి2 తరహాలోనే స్పైడర్‌ను కూడా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా మలిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments