Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ నాకు మంచి ఫ్రెండ్.. శ్రీమంతుడు చూసి చెర్రీ ఒక్కడే అభినందించాడు: మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెర్రీతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్‌' చిత్రాన్ని తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (18:10 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెర్రీతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్‌' చిత్రాన్ని తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుడి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
ఈ సందర్భంగా తమిళ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్‌ చరణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యాన్స్- ప్రిన్స్ ఫ్యాన్స్‌ మధ్య వస్తున్న తగాదాలపై కూడా స్పందించాడు. 
 
అభిమానుల మధ్య ఇంత గొడవ జరిగినా కూడా హీరోలు మాత్రం చాలా క్లోజ్‌గా ఉంటారు. మహేష్‌ స్వయంగా చిరంజీవి తనకు చాలా దగ్గరి వ్యక్తి, రామ్‌ చరణ్‌ కూడా బాగా క్లోజ్‌ అంటూ చెర్రీ, మహేష్‌ల స్నేహం గురించి చెప్పాడు. గతంలో చెర్రీ ఫ్యామిలీ, ప్రిన్స్ ఫ్యామిలీ విదేశీ టూర్ వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహేష్‌ 'శ్రీమంతుడు' చిత్రాన్ని చూసి కేవలం తనను రామ్‌ చరణ్‌ ఒక్కడు మాత్రమే అభినందించాడని మహేష్ చెప్పాడు. 
 
ఇదిలా ఉంటే.. 'స్పైడర్' ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ వైపు షూటింగ్ కొనసాగుతుండగానే, బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ.150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలున్నాయిని చెప్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments