Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నకు కరోనా నెగెటివ్... ఐపాడ్‌లో క్రికెట్ వీక్షిస్తున్నారు... : ఎస్.పి. చరణ్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (17:27 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన తనయుడు శుభవార్త చెప్పారు. తన తండ్రికి కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. 
 
తన తండ్రి ఆరోగ్యం గురించి సోమవారం శుభవార్త చెబుతానని గత వారం చరణ్ వెల్లడించిన విషయం తెల్సిందే. అదేవిధంగా సోమవారం ఆయన ఓ సందేశం వెల్లడించారు. ఇందులో తన తండ్రి బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా రిపోర్టు నెగెటివ్ వచ్చినా తాము, దాని గురించి పట్టించుకోవడంలేదని, ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించామని తెలిపారు.
 
ప్రస్తుతం తన తండ్రి ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారని, రాయగలుగుతున్నారని, చక్కగా భావవ్యక్తీకరణ చేయగలుగుతున్నారని చరణ్ వివరించారు. అంతేగాకుండా, వారాంతంలో తన తల్లిదండ్రులు పెళ్లిరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు.
 
అయితే, వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుందన్నారు. అయన ఊపిరితిత్తులు ఇంకా పూర్తిస్థాయి సామర్థ్యం సంతరించుకోలేదని, అందుకే వెంటిలేటర్ సాయం కొనసాగిస్తున్నారని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆగస్టులో కొవిడ్ కారణంగా ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించడం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments