Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూమర్స్‌కు ఓ నమస్కారం.. సెల్ఫీ దిగి పోస్ట్ చేసిన సమంత.. చెప్పేందుకు ఏదోకటి ఉండాలిగా డార్లింగ్!!

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను పెళ్లాడనుందని మీడియాలో వస్తున్న వార్తలపై సమంత ట్విట్టర్లో స్పందించింది. చైతూతో పెళ్లిపై ట్విట్టర్లో సమంతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ట్విట్టర్ వేదికగా, త

Webdunia
ఆదివారం, 17 జులై 2016 (12:06 IST)
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యను పెళ్లాడనుందని మీడియాలో వస్తున్న వార్తలపై సమంత ట్విట్టర్లో స్పందించింది. చైతూతో పెళ్లిపై ట్విట్టర్లో సమంతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ట్విట్టర్ వేదికగా, తన వివాహంపై వస్తున్న వార్తల నుంచి హనీమూన్ వరకూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. వీటిల్లో కొన్ని చిలిపి, మరికొన్ని సెన్సేషనల్ జవాబులిచ్చింది. 
 
చిలిపి ప్రశ్నలు వేస్తున్న అభిమానులను డార్లింగ్ అని సంబోధిస్తూ, సమంత పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. సెప్టెంబర్ 23న మీ వివాహం కుదిరిందటగా? అన్న ప్రశ్నకు ఆ విషయం ఎవరూ చెప్పలేదుగా అని అంది. కొన్ని వెబ్ సైట్లలో హనీమూన్ తేదీలు, ఎక్కడికి వెళ్లనున్నారన్న విషయాలపై రూమర్స్ వస్తున్నాయని చెప్పగా, ఓ నమస్కారం పెడుతూ సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. 
 
పెళ్లి ఎవరెవరికి జరుగుతుందో చూడాలని ఉందని ఓ అభిమాని చెప్పగా, తన కోరిక కూడా అదేనని అంది. మీ పెళ్లికి పార్క్ హయత్ హోటల్‌ను ఎంచుకున్నారటగా? అన్న ప్రశ్నకు... ఆ హోటలా? వావ్... దీనిపై అందరూ చర్చించండి అని చమత్కరించింది. మరో అభిమాని, ఈ సోది అంతా ఎందుకు డార్లింగ్... ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుందిగా అంటే, అసలు ఏదో ఒకటి ఉండాలిగా డార్లింగ్ అని తనదైన శైలిలో చెప్పుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments