విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (17:49 IST)
Vijay Antony
మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ‘మార్గన్’ అంటూ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. 
 
జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సోల్  ఆఫ్ మార్గన్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ 'సోల్ ఆఫ్ మార్గన్’ను చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భాష్య శ్రీ రచించిన ఈ పాటను అక్షర ఆలపించారు. విజయ్ ఆంటోనీ బాణీ వెంటాడేలా, సినిమా థీమ్‌ను చాటేలా ఉంది.
 
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
 
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆపరేషన్ చేసి పాము ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్ (వీడియో)

NEET: నీట్‌లో 99.99 శాతం.. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments