Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజెక్షన్ ధర రూ.16కోట్లు.. సోనూ సాయం

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:59 IST)
కరోనా సమయంలో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి తనవంతు సాయం అందచేశారు. 
 
మహారాష్ట్రకు నాగ్‏పూర్‏కు చెందిన 16 నెలల చిన్నారి విహాన్ స్పైనల్ మస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపుడుతున్నాడు. ఈ వ్యాధికి జాల్ గెన్జ్ మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. అమెరికాలో ఉండే ఈ ఇంజక్షన్ ఇవ్వాలంటే రూ. 16 కోట్లు ఖర్చు చేయాలి.  
 
ఆ చిన్నారి ప్రాణాలు దక్కాలంటే రెండు నెలల్లో రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.. అయితే అంత ఖరీదైన ఇంజెక్షన్ ఇప్పించే స్థోమత ఆ బాబు తల్లిదండ్రులకు లేదు. డాక్టర్ విక్రాంత్, మీనాక్షి అకుల్వార్ తమ బిడ్డను బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారు.
 
దీంతో రూ. 16 కోట్లను సేకరించేందుకు విరాళాలు చేపట్టారు. సోషల్ మీడియా.. సన్నిహితుల ద్వారా తమ బిడ్డను బతికించుకోవడానికి విరాళాలు చేపట్టారు. 
 
అయితే ఇప్పటివరకు ఈ చిన్నారికి సాయం చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్పాయ్ వంటి ప్రముఖులు స్పందించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే సోనూసూద్ కూడా తనవంతు సాయం చేశాడు.
 
ఇప్పటివరకు వచ్చిన రూ. 4 కోట్ల విరాళాల్లో ఆయనదే ఎక్కువ భాగం ఉంది. అంతేకాకుండా.. ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించాడు. ఇక విహాన్ బతకాలంటే నెల రోజుల్లో రూ. 12 కోట్లు సమకూర్చాలి. దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలి కోరుకున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments