Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌ కోసం పాదయాత్ర.. ఇంటి గేటు వద్దకు వచ్చిన రియల్ హీరో

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (10:28 IST)
Sonu Sood
రియ‌ల్ హీరో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌ను కలిసేందుకు ఓ వీరాభిమాని పాదయాత్ర చేశాడు. కరోనా కాలంలో సోనూ క‌ష్టాల్లో ఉన్న వారికి చేత‌నైన సాయం చేస్తూ.. వారి క‌న్నీళ్లు తుడుస్తూ.. వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నాడు. ఆక్సిజ‌న్ అంద‌క ప‌లువురు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లు క‌లిచి వేయ‌డంతో.. ఎక్క‌డిక్క‌డ ఆక్సిజ‌న్ ప్లాంట్‌లు, ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. 
 
ఇంత‌లా ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలు అని అనుకుంటున్నాడు క‌నుకే అత‌డికి రోజు రోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అత‌నికి గుడులు క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు. సోనూ సూద్ కార్యక్రమాలతో ఉత్తేజం పొందిన తెలంగాణలోని వికారాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఇంతవరకు అతని కోసం ఎవరూ చేయసి సాహసం చేశాడు.
 
సోనూసూద్​ను కలవడానికి వికారాబాద్​నుంచి ముంబయికి దాదాపు 700 కిలోమీట‌ర్లు పాదయాత్రగా వెళ్ళాడు. సోనూ సూద్ పోటోతో ఉన్న ప్లకార్డు చేతపట్టి ఛలో ముంబై అంటూ బయలుదేరాడు. 'రియల్ హీరో సోనూ సూద్.. టైటిల్ కింద నా గమ్యం.. నా గెలుపు ట్యాగ్ లైన్ తో..హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో పాదయాత్ర' చేశాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఎంతో శ్ర‌మ‌కోర్చి ముంబైకి చేరుకున్నాడు. 
 
అయితే పాద‌యాత్ర స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన వెంక‌టేష్ .. లాక్‌డౌన్ కార‌ణంగా నా తండ్రి నెల‌వారీ ఈఎంఐ చెల్లించ‌లేకపోయాడు. దీని వ‌ల‌న ఫైనాన్స్ వారు నా తండ్రి ఆటోని స్వాధీనం చేసుకున్నారు. దీని వ‌ల‌న నా తండ్రి మాన‌సికంగా కుంగిపోయారు. చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోయాను. ఇప్పుడు తండ్రిని కోల్పోవాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే సోనూసూద్ సాయం కోసం పాద్ర‌యాత్ర‌గా బ‌య‌లు దేరాను అని వెంక‌టేష్ పేర్కొన్నారు.
 
తన కోసం కాలినడకన 700 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్న అభిమాని కోసం సోనూసూద్ స్వయంగా ఇంటి గేటు వద్దకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన కాళ్లకు దండం పెట్టిన అభిమాని వెంకటేష్‌ను వారించి అక్కున చేర్చుకున్నాడు. ఎందుకింత కష్టపడ్డావంటూ చలించిపోయాడు. అత‌నితో ఫోటో దిగాడు. 
 
అంతే కాక దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని సోనూ సూద్ కోరారు. ఇక ఆ యువకుడికి సోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చిన‌ట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా నుంచి జూన్ 1న పాదయాత్ర ప్రారంభించిన వెంకటేశ్ పదో రోజున ముంబై చేరారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments