Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం-19 ఏళ్ల బాలుడిని అలా కాపాడిన సోనూసూద్

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (15:00 IST)
కరోనా కాలంలో పేద ప్రజలను ఆదుకున్న సినీ నటుడు సోనూసూద్ ఆపై కూడా పేదలకు ఏదో రూపంలో సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తూనే వున్నాడు. తాజాగా సోనూసూద్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మరోసారి వార్తల్లో నిలిచారు. 
 
వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను సోనూసూద్ రక్షించాడు. సోను ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 
 
ప్రమాదానికి గురైన కారు స్థితిని చూసిన సోనూ అందులో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని బయటకు తీసి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సకాలంలో వైద్యం పొందాడు. 
 
ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో సోనూసూద్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు సైతం విపరీతంగా షేర్ చేయబడుతున్నాయి. 
 
ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే త్వరలోనే విడుదల కానున్న మెగాస్టార్ ‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నారు. మరోవైపు పృథ్వీరాజ్, ఫతే వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments