Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్ స్పీడ్ సరిగ్గా లేదా? అమ్మాయికి బాగా బుద్ధి చెప్పిన సోనూ..?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (17:45 IST)
కరోనా కాలంలో వలస కార్మికులను గమ్యానికి చేర్చిన బాలీవుడ్ హీరో సోనూ సూద్.. ప్రస్తుతం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న చిత్తూరు రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిపెట్టారు. దీంతో ఆపదలో ఉన్న వారందరికీ సోనూ సూద్ ఓ దేవుడిలా కనిపిస్తున్నారు. అయిన దానికి కాని దానికి కూడా సహాయం కోరుతూ సరదాగా ఆటపట్టించేవారు కూడా మరి కొందరుంటున్నారు.
 
తాజాగా ఓ అమ్మాయి తన మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేదని.. దాన్ని పెరిగేటట్లు చేయమంటూ మంజు శర్మ ట్వీట్ చేసింది. దానికి సోనూ కూడా అంతే సెటైరికల్ సమాధానం చెప్పారు. 
 
రేపు ఉదయం వరకు ఆగండి.. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నా.. ఓ వ్యక్తి కంప్యూటర్ రిపేర్ చేస్తున్నా.. ఇంకా వివాహ సమస్యలు పరిష్కరించడం, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చడం వంటివి. కొంతమంది ఖాళీగా ఉన్న మహానుభావులు నాకిలాంటి గొప్ప గొప్ప పనులు చెబుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని మంజూ శర్మకు ట్వీట్ చేశారు. 
 
దీనిపై స్పందించిన నెటిజన్లు సోనూ సూద్ చాలా బిజీగా ఉన్నారు అని కామెంట్లు పెడుతున్నారు. భలే స్పందించారండి.. బాగా బుద్ది చెప్పారు అని సోనూని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments