Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో నటించట్లేదు.. సోనాలి బింద్రే

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (14:07 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడగా ఎట్టకేలకు క్యాన్సర్‌ను జయించారు. ప్రస్తుతం సోనాలి బింద్రే పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్ ద్వారా సోనాలి బింద్రే రీఎంట్రీ ఇచ్చారు. 
 
జూన్ నెల 10వ తేదీన ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్‌లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ తన గురించి వైరల్ అయిన పుకార్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. 
 
తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సోనాలి బింద్రే వెల్లడించారు.
 
తెలుగులో తాను తప్పకుండా సినిమాలు చేస్తానని సోనాలి బింద్రే కామెంట్లు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదని సోనాలి బింద్రే తెలిపారు.
 
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో తాను నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సోనాలీ బింద్రే స్పష్టం చేసింది. సోనాలి బింద్రేకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments