Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠ రేపేలా 'సోదర సోదరీమణులారా...' థియేట్రికల్ ట్రైలర్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (12:12 IST)
నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 ఈఎం ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం 'సోదర సోదరీమణులారా...'. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 
 
ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్‌తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించిన 'సోదర సోదరీమణులారా..'. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల‌లో సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందించగా, ఈ చిత్రానికి మోహన్ చారి కెమెరామెన్‌గా, పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు 
 
నటీనటులు:
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ తారాగణం కనిపించనుంది. 
 
సాంకేతిక నిపుణులు : 
రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా 
నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
నేపథ్య సంగీతం : వర్ధన్
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి
పిఆర్ఓ : బి ఏ రాజు's టీం
పబ్లిసిటీ డిజైనర్ : వివ రెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం చేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ (Video)

అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రుల జాబితా.. చంద్రన్నకు ఐదో స్థానం

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాఖలో అరుదైన నాగుపాము... పడగ మాత్రం బంగారు వర్ణం

కలెక్టరుపై దాడి కేసు.. 16 మంది అరెస్టు.. పోలీసుల అదుపులో 57 మంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments