Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి స్నేహపై సంచలన కామెంట్స్ చేసిన బైల్వాన్ రంగనాథన్

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (10:49 IST)
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు సర్వసాధారణం. అయితే స్నేహపై కోలీవుడ్ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ షో లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సీనియర్ నటి స్నేహ ఒకరు. తొలివలపు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. 
 
ముంబైలో పుట్టిన స్నేహ దుబాయ్‌లో పెరిగింది. స్నేహ మొదటిసారిగా 2000 సంవత్సరంలో ఇంగనే ఒరు నీలపక్షి అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 2001లో, గోపీచంద్ మొదటి సినిమా వలపుతో స్నేహ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. వాటిలో సంక్రాంతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 
 
వెంకీ, రాధాగోపాలం సినిమాలు కూడా స్నేహకు ప్లస్సయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తోంది. ఇంతలో స్నేహ కోలీవుడ్ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
 
అయితే తాజాగా సినీ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ స్నేహపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. “ప్రసన్న కంటే ముందు నటి స్నేహ ఒక ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడింది. ఆయన మరెవరో కాదు నిర్మాత నాగ్ రవి. వీరి ప్రేమ ఒక దశకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వజ్రాల ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు’’ అని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. 
 
"నిశ్చితార్థం తర్వాత, స్నేహకు తన ప్రియుడు, నిర్మాత నాగ్ రవిపై అనుమానం వచ్చింది. ఆ తర్వాత నిర్మాతతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఇక పెళ్లి ఇష్టం లేని స్నేహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడింది. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు" అని రంగనాథన్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నోయిడా వరకట్న కేసులో ట్విస్ట్ : నిక్కీ కుటుంబంపై వదిన ఆరోపణలు

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు మోడీ విరుగుడు... 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments