Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి శ్రీను, రామ్ సినిమాకు స్కంద టైటిల్ ఖరారు (video)

Webdunia
సోమవారం, 3 జులై 2023 (15:58 IST)
Ram- Skanda
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాకు 'స్కంద' టైటిల్ ఖరారు చేశారు. ది ఎటాకర్... అనేది ఉపశీర్షిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ & జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ రోజు (జూలై 3, సోమవారం) టైటిల్ వెల్లడిస్తూ... వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
 
'స్కంద' టైటిల్ గ్లింప్స్ బోయపాటి మార్క్ దర్శకత్వం అంతటా కనిపించింది. ఓ  దేవాలయం ప్రాంగణంలో రౌడీలను కథానాయకుడు ఊచకోత కోసే సన్నివేశాలను చూపించారు. ''మీరు దిగితే ఊడేది ఉండదు... నేను దిగితే మిగిలేది ఉండదు'' అని రామ్ పోతినేని చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ టైటిల్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు. 
 
చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ''స్కంద' టైటిల్ వీడియో గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. బోయపాటి శ్రీను గారి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉంటాయి. 'స్కంద'లో యాక్షన్ సీన్లను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మా హీరో రామ్ గారు యాక్షన్ సీన్లు అద్భుతంగా చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో ఆయన పవర్ ఫుల్ లుక్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15న ప్రపంచవవ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. 
 
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సంతోష్ డిటాకే, ఎడిటింగ్: తమ్మిరాజు, పీఆర్వో : వంశీ - శేఖర్, పులగం చిన్నారాయణ.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments