Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

దేవీ
శనివారం, 19 జులై 2025 (19:27 IST)
SJ Surya, Preeti Asrani
మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం  టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య  హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ కలిసి నిర్మిస్తున్నారు కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
 
మేకర్స్ ఈ రోజు కిల్లర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎస్.జె. సూర్య బ్లాక్ కోటు ధరించి షాట్ గన్ పట్టుకుని స్టయులీష్ గా కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.  
 
మరో పోస్టర్ లో ఒకవైపు చేతిలో గన్ పట్టుకుని, రెడ్ డ్రెస్‌లో ఉన్న ప్రీతి అస్రాని ని భుజాన ఎత్తుకున్న లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా పై చాలా క్యురియాసిటీ క్రియేట్ చేశాయి.
 
అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రాజెక్ట్ రావడం చూస్తేనే సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది. ఇది ఎస్.జె. సూర్యా – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో సినిమా. ఇంతకు ముందు నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి సినిమాల్లో కలిసి పనిచేశారు.
 
'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా అంతటా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments