Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని చిత్రం సరిపోదా శనివారం షూట్ లో ఎంటర్ అయిన ఎస్ జే సూర్య

డీవీ
శనివారం, 20 జనవరి 2024 (17:16 IST)
Sj surya shoot
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతుంది.
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యుల్ లో ఎస్ జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్ గా ఉండబోతుంది.
 
ఇప్పటికే విడుదలైన సరిపోదా శనివారం అన్‌చెయిన్డ్ వీడియోకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని సినిమాలో రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
 
పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments