శివకార్తికేయన్ గత కొన్ని చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో తెలుగులో కూడా క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు రెట్టింపు జోష్‌తో టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో 'ప్రిన్స్' అనే పక్కా ఎంటర్ టైనర్‌తో రాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఫస్ట్ లుక్ పోస్టర్ లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా రెఫ్రెషింగ్ గా కనిపించిన జోడి ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి 'ప్రిన్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
'జాతి రత్నాలు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటిరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ దీపావళికి విడుదల కానున్న తొలి చిత్రం' ప్రిన్స్'.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా అరుణ్ విశ్వ సహ నిర్మాత.