Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో ఉన్న జీవిత సోదరుడిని నేను కాపాడాలా? శివాజీరాజా

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (14:44 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఇరు పక్షాల మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. 'మా' ఎన్నికలు పూర్తయ్యాక ఇరుపక్షాల మధ్య వివాదాలు సర్దుమణుగుతాయనుకుంటే ముదిరిపాకాన పడుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నరేష్ ప్రెస్‌మీట్ పెట్టి శివాజీరాజాపై ఆరోపణలు చేయడంతో శివాజీరాజా కూడా ప్రెస్‌మీట్లు పెట్టి నరేష్ ప్యానెల్‌పై ప్రతి విమర్శలు చేస్తున్నారు. 
 
తాజాగా శివాజీరాజా మాట్లాడుతూ జీవిత రాజశేఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో ఒకసారి జీవిత తనకు ఫోన్ చేసి టాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా పట్ల, శ్రీరెడ్డి విషయం పట్ల సరిగ్గా స్పందించడం లేదని చెప్పారు. దానికి సమాధానంగా జీవిత వాళ్ల సోదరుడే డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడని, ఆ వార్త పేపర్లలో కూడా వచ్చిందని ఆమెకు గుర్తు చేసానన్నారు. 
 
ఆ విషయంపై తానెలా స్పందించగలనని అంటూ నేనే వెళ్లి జీవిత తమ్ముడిని పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకు రావాలా అని ప్రశ్నించారు. శ్రీరెడ్డి, డ్రగ్స్ విషయంలో జీవితకు నాకు అభిప్రాయభేదాలు వచ్చాయి కాబట్టే ఈ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఆమె పోటీ చేసారని చెప్పుకొచ్చారు. స్త్రీల గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే నరేష్‌కు నిజంగా స్త్రీల మీద అంత గౌరవం ఉంటే జీవితను ఎందుకు ప్రెసిడెంట్ చేయలేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments