Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... సిట్ ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలేస్తున్న 'కిక్' రవితేజ?

మాస్ మహరాజ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం తెల్లచొక్కా సెంటిమెంట్ పక్కనపెట్టి నల్లని చారలతో వున్న గళ్లగళ్ల చొక్కా వేసుకుని సిట్ కార్యాలయానికి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి ఆయనకు

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (17:06 IST)
మాస్ మహరాజ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం తెల్లచొక్కా సెంటిమెంట్ పక్కనపెట్టి నల్లని చారలతో వున్న గళ్లగళ్ల చొక్కా వేసుకుని సిట్ కార్యాలయానికి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి ఆయనకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు వేస్తున్న ప్రశ్నలలో కొన్నింటికి రవితేజ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం వస్తోంది.
 
సిట్ సంధించిన కొన్ని ప్రశ్నలు... 
మీరు డ్రగ్స్ తీసుకుంటారా?
నా తమ్ముడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసి అతడిని దూరంగా పెట్టినవాడిని. నేనెలా తీసుకుంటాను?
 
బ్యాంకాక్ వెళ్లినప్పుడు పార్టీలు చేసుకునేవారా?
సినిమా షూటింగులతోనే వళ్లంతా గుల్లై అలసిపోతాం. ఇక పార్టీలకు ఎక్కడ ఛాన్స్ వుంటుందండీ?
 
పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకోవడం మీకు తెలుసా?
అతడి వ్యక్తిగతం గురించి నాకెలా తెలుస్తుందండీ?
 
మీ కారు డ్రైవర్ శ్రీనివాసరాజు మీకు డ్రగ్స్ సప్లై చేసేవాడా?
అతడు నాకు కారు డ్రైవరుగానే తెలుసు. అతడు నాకెలా డ్రగ్స్ ఇస్తాడు?
 
ఇలా సిట్ వేసిన ప్రశ్నలకు తిరుగు ప్రశ్నలతో రవితేజ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కొన్ని ప్రశ్నలకు రవితేజ మౌనంగా వుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో రవితేజ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ డ్రగ్స్ వాడుతున్నారా... లేదంటే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా... అనేది విచారణలో తేలాల్సి వుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments