Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ మంగ్లీ బోనాల పాట వివాదాస్పదం.. ఏమైందంటే?

Webdunia
శనివారం, 17 జులై 2021 (17:05 IST)
సింగర్ మంగ్లీ తాజాగా పాడిన ఓ బోనాల పాట వివాదాస్పదమవుతోంది. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..` అంటూ సాగే పాట విడుదలయింది. 
 
ఈ పాటకు పాటకు ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. లిరిక్స్ రామస్వామి రాయగా, రాకేష్ వెంటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్‌పై కూడా కనిపించారు. ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాట లిరిక్స్‌పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
బోనాల పండగ వేళ అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడాలి గానీ.. విమర్శిస్తూ పాడడం ఏంటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పాటలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని.వాటిని వెంటనే మార్చాలని, క్షమాపణ కూడా చెప్పాలని ఆర్‌జే కిరణ్ విమర్శించారు. 
 
అంతేకాదు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మంగ్లి స్థానికతను కూడా కొందరు ప్రశ్నిస్తోన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంగ్లీకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసంటూ ప్రశిస్తున్నారు.
 
అయితే కొందరు మాత్రం సింగర్ మంగ్లీకి మద్దతుగా నిలిచారు. అందులో ఆమె తప్పేం లేదని అంటున్నారు. లిరిక్స్ ఆమె రాయదని చెప్పారు. అలాగే ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments