Webdunia - Bharat's app for daily news and videos

Install App

'​సింగం-3' టీజర్‌ రెడీ ... ఫుల్‌ అండ్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాల

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (16:48 IST)
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. 
 
ఇక సింగం-3 తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల టీజర్‌ను సోమవారం (రేపు)ను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలుమించే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. 
 
ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ చక్కటి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి, డిసెంబర్ 16వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments