Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సలిజం, ప్రేమ, పోరాటాల కలయిక సింధూరం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (17:41 IST)
Siva Balaji, Dharma, Brigida Saga, Shyam Tummalapally,
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ,  నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో ఈ సినిమా చేశారు. తమిళ్ లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్ గా చేశాడు, కిషోర్ డైలాగ్స్ బాగా కుదిరాయి అన్నారు.
 
నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా మాట్లాడుతూ, మంచి సినిమా తీసామనే సంతృప్తి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న సిందూరం అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
శివ బాలాజీ మాట్లాడుతూ,  సిందూరం సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా జానర్ విన్నప్పుడు ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ గా కనిపించబోతున్న సిందూరం సినిమా కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  నిర్మాత ప్రవీణ్ కు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ శ్యామ్ కు ఉన్న నాలెడ్జ్ సిందూరం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సిందూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 - 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments