Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ ''కుక్క'' కాదు ''నక్క''.. అదేమైనా లిక్కర్ షాపా? శివాలెత్తిన శింబు!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (15:07 IST)
మన మా ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో.. అదే తంతు ప్రస్తుతం తమిళ ‘నడిగర్ సంఘం’ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. దాదాపు ఆరు నెలల ముందు మొదలైన రభస ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇంకో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శరత్ కుమార్-విశాల్ వర్గం నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం చేస్తున్నాయి. 
 
ముందు విశాల్ బృందమే శరత్ వర్గంపై విరుచుకుపడుతూ వాళ్లను డిఫెన్స్‌లోకి నెడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ శరత్ కుమార్ వర్గం మాటలకు పదును పెట్టింది. మొన్న విశాల్-నాజర్ వర్గానికి మద్దతుగా నిలిచినందుకు కమల్ హాసన్‌పై శరత్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా.. తాజాగా శరత్ వర్గం తరఫున ఎన్నికల్లో నిలిచిన యువ కథానాయకుడు శింబు విశాల్ మీద తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. 
 
తమిళ నటుల్లో చీలికలు తెచ్చేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడని దుయ్యబట్టాడు. నిన్నకాక మొన్న వచ్చిన బచ్చా విశాల్ అని.. శరత్ కుమార్ లాంటి సీనియర్ని విమర్శించడానికి అతడికి అర్హత లేదన్నాడు. నడిగర్ సంఘం విషయంలో ఇబ్బందులేమైనా ఉంటే చర్చించుకోవాలని.. అలా కాకుండా వీధిలో పడి గొడవ చేయడం విశాల్ నీచమైన బుద్ధికి నిదర్శనమని శింబు వ్యాఖ్యానించాడు. 
 
తమ వర్గానికి చెందిన సీనియర్ నటుడు రాధా రవి విశాల్‌ను ''కుక్క'' అనడం తప్పేనని.. అయితే విశాల్ నిజానికి ''నక్క''లాగా విశాల్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని శింబు ధ్వజమెత్తాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ పడగొట్టడం గురించి ఇప్పుడొచ్చి గొడవ చేస్తున్న విశాల్.. ఇంతకుముందు ఎక్కడికి పోయాడని శింబు ప్రశ్నించాడు. నడిగర్ సంఘం బిల్డింగ్‌ ఏమైనా టాస్మాక్ (లిక్కర్) షాపా? అంటూ శింబు ప్రశ్నించాడు. మరి శింబు విమర్శలకు విశాల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments