Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార హ్యాపీగా ఉండాలి: మాజీ లవర్ శింబు.. ఎందుకలా చెప్పాడు?!

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2015 (12:07 IST)
మాజీ ప్రేయసి గురించి మాట్లాడేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ శింబు తన మాజీ లవర్ నయనతార గురించి నవ్వుతూ మాట్లాడారు. ప్రభుదేవా ఎంట్రీ ఇవ్వడంతో శింబు-నయనతార లవ్వాయణం బ్రేకప్ అయ్యింది. ఆపై ప్రభుదేవా-నయన ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది. అయినప్పటికీ శింబు నయనతార బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమా చేశారు. రొమాన్స్ పండించారు.
 
ఐతే శింబు ఓ అడుగు ముందుకేశాడు. తన మాజీ ప్రేయసి కొత్త ప్రేమాయణం గురించి ఓ మీడియా సమావేశంలో మొహమాటం లేకుండా స్పందించాడు. తన కొత్త సినిమా ‘వాలు’ విజయోత్సవంలో భాగంగా శింబు ప్రెస్ మీట్ పెట్టగా.. డైరెక్టర్ విఘ్నేష్‌తో నయనతార ప్రేమాయణం గురించి మీరేమంటారు అంటూ శింబును సూటిగా ప్రశ్నించాడు ఓ విలేకరి. శింబు నో కామెంట్ అని తప్పించుకోకుండా దీనికి నవ్వుతూ సమాధానమిచ్చాడు. 
 
‘‘నయన్ ప్రస్తుతం ఇలాంటి రిలేషన్ షిప్‌లో ఉందని నేను నమ్మడం లేదు. ఒక వేళ మీరు అన్నదే నిజమైతే ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను’’ అని బదులిచ్చి ఆశ్చర్యపరిచాడు శింబు. కాగా శింబు-నయనతారల ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

కానీ నయన శింబుకు టాటా చెప్పేసి ప్రభుదేవా లవ్వాయణం కొనసాగించింది. అది కూడా బ్రేకప్ అయ్యింది. ఇటు శింబు-హన్సికల చిగురించిన లవ్వాయణానికి కూడా బ్రేక్ పడంది. ప్రస్తుతానికి శింబు-నయనతార సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

Show comments