Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారపై శింబు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? లేకుంటే..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (16:35 IST)
శింబు-నయనతార కోలీవుడ్ మాజీ ప్రేమికులు. ఈ మధ్య శింబు-నయనతారల ప్రేమాయణం బ్రేకప్ అయినా.. తిరిగి తమిళ సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు నయనతార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో శింబు తన సొంత బ్యానర్‌లో సినిమా చేసేందుకు నయనకు ఛాన్స్ ఇచ్చాడు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై ఇదు నమ్మ ఆళు సినిమా రూపుదిద్దుకుంటోంది. 
 
అయితే శింబుకు ప్రస్తుతం నయనతారపై పోలీస్ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాక్ వస్తోంది. ఇటీవలే వాలు సక్సెస్ మీట్‌లో నయనతార ఎక్కడున్నా బాగుండాలని.. ఆమెను పక్కనుండి మరీ పెళ్లి చేయిస్తానని కామెంట్ చేసిన శింబు.. తన సినిమా షూటింగ్‌లో పాల్గొనట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నడిగర్ సంఘంలో నయనపై శింబు ఫిర్యాదు చేశాడు. దీనిపై నయనతార కూడా వివరణ ఇచ్చింది. ఇదు నమ్మ ఆళు సినిమా కోసం డేట్స్ కేటాయించానని.. అయితే ఆ సినిమా టీమ్ సద్వినియోగం చేసుకోలేదని తెలిపింది. ప్రస్తుతానికి భారీ ప్రాజెక్టుల కారణంగా బిజీ షెడ్యూల్‌తో శింబు సినిమా షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నానని చెప్పింది. 
 
కాగా ఇదు నమ్మ ఆళు సినిమాకు చెందిన ఓ పాట, మరో రెండు సీన్స్ తీయాల్సి వుందని.. ఆ సీన్స్‌కు ఎలాగోలా డేట్స్ కేటాయించవచ్చునని.. అదో పెద్ద మ్యాటర్ కాదని శింబు అండ్ టీమ్ ఎంత చెప్పినా.. నయన పట్టించుకోవట్లేదని.. ఇతర సినిమాలపైనే దృష్టి పెట్టిందని శింబు వాపోతున్నాడట.

దీంతో ఇక లాభం లేదని నయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చే దిశగా శింబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదు నమ్మ ఆళు సినిమాను టి. రాజేందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత పాండ్యరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments