Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంప‌త్ నంది నిర్మాత‌గా సింబా ప్రారంభం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (16:41 IST)
Sampath Nandi
మ‌నిషి అభివృద్ధి పేరుతో త‌న‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న ప్ర‌కృతి గురించి మ‌ర‌చిపోతున్నాడు. ముఖ్యంగా మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను నాశ‌నం చేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక ఒక వైపు, కాలుష్యం పెరిగి మ‌రో వైపు భూమి నాశం అవుతుంది. చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మాత‌లుగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. `సింబా` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. సినిమా టైటిల్‌, కాన్సెప్ట్ త‌దిత‌ర విష‌యాల‌ను వివ‌రిస్తూ చిత్ర యూనిట్ సోమ‌వారం ఓ వీడియో ప్రోమోను విడుద‌ల చేసింది. 
 
వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే.. కొంద‌రు మ‌నుషులు అడ‌విలోని చెట్ల‌ను న‌రికేస్తున్నారు. అడ‌వి పాడ‌వుతుండ‌టంతో జంతువుల‌న్నీ భ‌యంతో పారిపోతున్నాయి. అయితే అంత‌లో మ‌న క‌థానాయ‌కుడు `సింబా` చెట్టు న‌రుకుతున్న వాడిపైకి న‌రికిన చెట్టును ఆయుధంగా చేసుకుని దాడి చేస్తాడు. `మ‌న‌కు బ్ర‌తుకునిచ్చే మొక్క‌ని బ్ర‌త‌క‌నిద్దాం` అనే లైన్ ద్వారా సినిమా, హీరో పాత్ర‌ ఎలా ఉండ‌బోతుందనే విష‌యాన్ని మేక‌ర్స్ రివీల్ చేశారు. 
 
`ది ఫారెస్ట్ మ్యాన్‌` ట్యాగ్ లైన్‌తో మాన‌వ మేథ‌స్సు సంబంధిత సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న `సింబా` ఒక‌వైపు మంచి మెసేజ్‌తో పాటు విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. డైరెక్ట‌ర్‌, నిర్మాత సంప‌త్ నంది, ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తుండ‌టం విశేషం. హీరో, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments