Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 13వ సీజన్‌.. విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా.. ట్వీట్స్ వైరల్

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (15:52 IST)
Sidharth Shukla
బాలీవుడ్ బిగ్ బాస్ ముగిసింది. ఫలితంగా బిగ్ బాస్ 13వ సీజన్‌కు శుభం కార్డు పడింది. ఫైనల్లో బాలికా వధు ఫేం సిద్ధార్థ్ శుక్లా మొదటి స్థానంలో నిలిచాడు. అసిమ్ రియాజ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఎంతో ఉత్కంఠగా, ఉద్వేగ భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫైనల్‌కు సిద్దార్థ్‌తో పాటు..నటుడు అసీం రియాజ్‌లు చేరుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 13కి హోస్ట్‌గా వ్యవహరించారు.
 
అయితే బిగ్ బాస్ షో క్రియేటివ్ టీం మెంబర్ చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. విజేతగా నిలిచేందుకు అసీంకు అన్ని అర్హతలున్నా.. అలా చేయలేదని క్రియేటివ్ టీంలో సభ్యురాలైన ఫెరీహ టెక్నీషియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేశారు. ఇదొక ఫిక్స్‌డ్ షో అంటూ ఆరోపణలు గుప్పించారు. దీని కారణంగా ఛానెల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు.
 
అంతర్జాతీయంగా ప్రముఖుల నుంచి అసీంకు వస్తున్న మద్దతు చూడలేక, సిద్దార్థ్ గెలిచేలా వ్యూహాలు రచించారని మండిపడ్డారు. మహిళలపై పట్ల అనుచితంగా ప్రవర్తించిన సిద్ధార్థ్ విజేతగా ప్రకటించి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. కాగా బిగ్ బాస్ 13వ సీజన్ విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లాకు ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ కింద రూ.40లక్షలు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments