Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తెలుసు కదా నా సినిమా గురించి అంటున్న సిద్దు జొన్నలగడ్డ

డీవీ
శనివారం, 20 జులై 2024 (13:52 IST)
Siddu Jonnalagadda
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'తెలుసు కదా'తో అలరించబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. నీరజ కోన, సిద్దు స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలని నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు రోలింగ్ కి రెడీ అయ్యింది.
 
'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో టాకీ పార్ట్స్ తో పాటు సాంగ్స్ ని షూట్ చేస్తారు. హైదరాబాద్‌లో 30 రోజుల పాటు సాగే షెడ్యూల్ ఇది. మూవీ లీడ్ కాస్ట్ షూటింగ్‌లో పాల్గొంటారు.
 
నిర్మాతలు ప్రీ-ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ని సూచిస్తుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్‌గా మేకోవర్ కానున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
హై బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.  
 
థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
 
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments