Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధార్థ్ రాయ్ కంటెంట్ చూసాక నేను జెలసీ ఫీలయ్యా.: కోన వెంకట్

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (18:31 IST)
Kona Venkat - Trinatha Rao Nakkina
చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది  ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. 
 
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. దర్శకుడు యశస్వీ గారు, సినిమా టీం అంతా చాలా కష్టపడి పాషన్ ఈ సినిమా చేశారు. చాలా ఇంటెన్స్ పాయింట్ తో సినిమా తీశారు. చూసిన వారు చాలా అద్భుతంగా వుందని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ చిత్ర నిర్మాతలు మరిన్ని గొప్ప సినిమాలు చేయాలి. దీపక్ చాలా ఇంటెన్స్ వున్న రోల్ ని చాలా అద్భుతంగా  చేశారు. మొదటి సినిమాకే అన్ని ఎమోషన్స్ ని ప్రదర్శించడం మామూలు విషయం కాదు. తొలి సినిమాకే ఇంత వైవిధ్యమైన పాత్ర దక్కడం చాలా అరుదు. అదే తన తొలి విజయం. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ ట్రైలర్ చాలా బావున్నాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి సపోర్ట్ చేయండి'' అని కోరారు.
 
రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. కంటెంట్ కి మించిన స్టార్ లేరు. అలాంటి కంటెంట్ ని రాశారు దర్శకుడు యశస్వీ. నేను ఎందుకు ఇలాంటి కంటెంట్ రాయలేకపోయాననే జెలసీ వచ్చింది. ఇలాంటి ఫీలింగ్ వచ్చిదంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ కంటెంట్ నా దగ్గరకి ఎందుకు రాలేదు ? దీపక్ ని నేను ఎందుకు పరిచయం చేయలేదు? నాకు ఈ రెండు రిగ్రెట్స్ వున్నాయి. టీజర్ లో దీపక్ ని చూసి ఆశ్చర్యపోయాను. విజువల్స్ అద్భుతంగా వుంది. ఇందులో కథ, క్యారెక్టర్స్, టెక్నికల్ వర్క్ అన్ని అద్భుతంగా  వున్నాయి. మనసున్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకి వస్తారనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  ‘సిద్ధార్థ్ రాయ్' ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్'' అన్నారు.
 
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా వుంది. దీపక్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడట నచ్చింది. తన లుక్ వాయిస్ చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తను హీరో కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు యశస్వీ చాలా కాలంగా నాకు తెలుసు. చాలా కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ‘సిద్ధార్థ్ రాయ్' ఒక గౌతమ బుద్ధ సినిమా తీశాడు. దేవదాస్ ఎంత హిట్టు కొట్టాడో గౌతమ బుద్ధ అంత హిట్ కొట్టాలి. తప్పకుండా సినిమా చూసి అంత హిట్ ఇవ్వాలి. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.  ప్రేక్షకులు సినిమా చూసి పెద్ద హిట్ ఇచ్చి టీంని బ్లెస్ చేయండి'' అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments