Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలోకి ''బిచ్చగాడు'': అక్కడా విజయ్ ఆంటోనీనే హీరోనా...? సిద్ధార్థ్, జీవీల సంగతి?

తమిళంలో పిచ్చైకారన్‌గా విడుదలై భారీ కలెక్షన్స్ సాధించిన 'బిచ్చగాడు' తెలుగులోనూ కలెక్షన్ల పరంగా అంతే వేగంతో పరుగులు తీశాడు. తెలుగులోకి తమిళ డబ్బింగ్ సినిమాగా వచ్చిన బిచ్చగాడుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ నిర్మాతకు కోట్లాది రూపాయల లాభాలను

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:32 IST)
తమిళంలో పిచ్చైకారన్‌గా విడుదలై భారీ కలెక్షన్స్ సాధించిన 'బిచ్చగాడు'
 తెలుగులోనూ కలెక్షన్ల పరంగా అంతే వేగంతో పరుగులు తీశాడు. తెలుగులోకి తమిళ డబ్బింగ్ సినిమాగా వచ్చిన బిచ్చగాడుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ నిర్మాతకు కోట్లాది రూపాయల లాభాలను సంపాదించిపెట్టిన బిచ్చగాడు.. శతదినోత్సవానికి రెడీ అవుతున్నాడు.
 
ఇప్పటికే 70 శాతం ఆక్యుపెన్సీ రేటుతో బిచ్చగాడు కొన్ని కేంద్రాల్లో అదరగొట్టేస్తున్నాడు. అద్భుత టేకింగ్, అమ్మ సెంటిమెంట్‌, లవ్ సమ్మిళితమైన ఈ సినిమా తెలుగులో అదరగొట్టేసిన నేపథ్యంలో.. హిందీలో కూడా సినిమాను రీమేక్ చేయాలని.. విజయ్ ఆంటోనీనే హీరోగా.. శశినే దర్శకుడిగా రూపొందించాలనుకుంటున్నారు. 
 
కానీ విజయ్ ఆంటోనీ, శశి కాంబో హిందీకి ప్లస్ అవుతుందా లేకుంటే వేరొక బాలీవుడ్ నటుడితో ఈ సినిమాను తెరకెక్కిద్దామా అంటూ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సైతాన్ సినిమా (తెలుగులో బేతాళుడు) షూటింగ్‌లో విజయ్ ఆంటోనీ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక హిందీ భిక్షగాడిపై శశి, విజయ్ ఆంటోనీ దృష్టి పెడతారని తెలుస్తోంది. అయితే హిందీ రీమేక్‌లో బాయ్స్ హీరో సిద్ధార్థ్, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌లు నటించే అవకాశం ఉందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

PM Modi: ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం- మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments