Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీతో రిలేషన్షిప్‌ను వద్దనుకున్న బాలీవుడ్ నటి!

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:39 IST)
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. పైగా, పిల్లలు కూడా. కుటుంబంలో ఏర్పడిన కలతల కారణంగా మొదటి భర్త రాజా చౌదరితో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత అభినవ్ కోహ్లీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. దీనిపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. 
 
దీంతో శ్వేతా తివారీ కాస్తంత ఘాటుగా స్పందించింది. తన గురించి మీడియా ఏం రాసినా పట్టించుకోనని, తాను తన పిల్లల భవిష్యత్ కోసమే అభినవ్ కోహ్లీ నుంచి విడిపోతున్నట్టు తెలిపింది. తనను వేలెత్తి చూపేవారిపై తీవ్రంగా మండిపడింది.
 
తమ భాగస్వాములను మోసం చేసే వారితో పోలిస్తే తాను చాలా బెటరని శ్వేత పేర్కొంది. రిలేషన్‌షిప్‌ను వద్దనుకునే గట్స్ తనకు ఉన్నాయని తెలిపింది. ఏదైతో సరైనదో దానినే చేస్తానని చెప్పుకొచ్చింది. తన గురించి ఏమి రాసినా పట్టించుకోబోనని పునరుద్ఘాటించింది. 
 
అంతేకాదు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా వివాహంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు ఓ ప్లాట్‌ఫామను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి వివాహ బంధంలో ఎదుర్కొంటున్న బాధల నుంచి బయటకు రావాలని, ఎవరినీ కేర్ చేయొద్దని మహిళలకు పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments