Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడులో శ్రుతిహాసన్ గ్లామర్ తగ్గడానికి కాస్ట్యూమ్సే కారణం...?

కాటమరాయుడు సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో శ్రుతి అందాలు బాగా తగ్గిపోయాయని.. ఫేడవుట్ అయిపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. కాటమరాయుడిగా పవన్ కల్యాణ్ అంద

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (14:14 IST)
కాటమరాయుడు సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో శ్రుతి అందాలు బాగా తగ్గిపోయాయని.. ఫేడవుట్ అయిపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. కాటమరాయుడిగా పవన్ కల్యాణ్ అందంగా కనిపిస్తే.. శ్రుతిహాసన్ మాత్రం గ్లామర్‌తో ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇందుకు కారణం.. ఆమె కాటమరాయుడులో వేసిన దుస్తులని టాక్. 
 
గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతిహాసన్ గ్లామర్ సినిమా ప్లస్ అయ్యింది. అయిచే కాటమరాయుడులో శ్రుతిహాసన్ లావుగా కనిపించింది. ఇంకా ఈ సినిమాలో అమ్మడు స్టైల్ బాగా మిస్సైంది. దీనిపై డాలీ స్పందించాడు. పాటల్లో శ్రుతిహాసన్ వేసుకున్న దుస్తులు హైదారాబాద్‌లోని కోఠి ప్లాట్‌ఫామ్‌ మీద కూడా దొరకుతాయని కొంతమంది వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
 
శ్రుతి కాస్ట్యూమ్స్‌, స్టైలింగ్‌ విషయంలో విమర్శలు వస్తున్న మాట నిజమేనని చెప్పాడు. ఈ సినిమా పాటల్లో కాస్ట్యూమ్స్‌ కోసం ముంబై డిజైనర్లు పనిచేశారు.  ముందుగా వారికి పేమెంట్ అంతా ఇచ్చేసి నేరుగా లోకేషన్‌కు వెళ్లిపోయినట్లు తెలిపాడు. వాళ్లు ఇచ్చిన కాస్ట్యూమ్స్ చెక్ చేసుకోకపోవడంతో శ్రుతిని కెమెరా ముందు చూసి షాక్ తిన్నామన్నాడు. డిజైన్ చేసిన దుస్తులు శ్రుతికి ఏమాత్రం సూట్ లేదు. 
 
యూనిట్‌లో ఎవరికీ ఆ కాస్ట్యూమ్స్‌ నచ్చలేదు. కానీ, మార్చడానికి టైమ్‌ సరిపోలేదు. ఫారిన్‌లో షూటింగ్‌ కావడంతో కాస్ట్యూమ్స్‌ను మార్చడానికి వీలు కుదర్లేదని.. అదే దుస్తులతో షూటింగ్ ముగించేస్తామని తెలిపాడు. అలా శ్రుతిహాసన్ అందానికి దుస్తుల డిజైన్ కూడా కారణమైందని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments