Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి పని జరిగింది.. హ్యాపీగా ఉన్నానంటున్న శృతిహాసన్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:18 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ ప్రేమ విఫలమైందా? అంటే.. అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దీనికి ఆమె తాజాగా చేసిన ట్వీట్‌నే ఆధారంగా చూపిస్తున్నాయి. ఇటీవల తనకు మంచి జరిగిందనీ, ఇపుడు చాలా హ్యాపీగా ఉన్నాననీ ట్వీట్ చేసింది.
 
అటు తెలుగు, ఇటు తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా నటిస్తూ మంచి ఊపుమీద ఉన్న శృతిహాసన్ గత రెండేళ్లుగా ఆమె చిత్రాల్లో నటించడం లేదు. అదేసమయంలో తన లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో ప్రేమలో మునిగిపోయారు. తన ప్రియుడుని తండ్రి కమల్ హాసన్‌కు కూడాపించారు. ఒక దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియుడితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా అతనికి శృతిహాసన్ దూరమైనట్టు సమాచారం. అందుకే  రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దక్షిణాదిలో శృతిహాసన్ హల్‌చల్ రేపేందుకు సిద్ధమవుతోందట. సినిమాలకు సంబంధించిన కొత్త స్క్రిప్టులను పరిశీలిస్తుందట. 
 
ఇదే విషయంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "నా విషయంలో చాలా కాలంగా అనుకొంటున్న మంచి పని జరిగిపోయింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అదృష్టం నన్ను వెంటాడింది. దేవుడి దీవెనలు నాపై కురిసాయి" అని శృతిహాసన్ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఏం జరిగిందనే విషయంపై శృతి క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments