Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్వారంటైన్‌లో ఏకాంతంగా ''జెర్సీ" హీరోయిన్

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:53 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 50 వేలకు పైగా రోగులు చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అనేక సెలెబ్రిటీలు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోయారు. మరికొందరు సెలెబ్రిటీలు ముందుగానే జాగ్రత్తపడి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అలా హోం క్వారంటైన్‌లో ఉన్నవారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. ఈమె తెలుగు హీరో నాని నటించిన "జెర్సీ" చిత్రంతో మంచి ఫేమస్ అయ్యారు. 
 
బెంగళూరుకు చెందిన శ్రద్ధా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడంతో అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. దీంతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను శ్రద్ధా ఖండించింది.
 
మార్చి 12 -15 తేదీల మధ్య కాలంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని, ఆ విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని, అయినా తన ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.  మార్చి 29 నాటికి క్వారంటైన్‌ 14 రోజులు పూర్తయిందని, ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని కూడా శ్రద్ధా ట్వీట్‌ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments