Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైంధవ్ నుంచి వెంకటేష్ కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్‌

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (15:02 IST)
Shraddha Srinath
విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్‌ లో జరుగుతోంది.
 
ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది.
 
మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీలో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా సైంధవ్‌ లో మనోజ్ఞ గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. చాలా మంది అద్భుతమైన నటీనటులు   కలిసి తెరపై కనిపిస్తూ ప్రేక్షకులకి గొప్ప అనుభూతి ని ఇవ్వనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్  పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments