Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా 'అర్థం'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (17:56 IST)
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత. ఇంతకుముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు. 
 
'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, రామ్ గోపాల్ వర్మ 'మర్డర్'లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, నటుడిగా మారిన దర్శకుడు దేవి ప్రసాద్, తమిళ హిట్ చిత్రం 'వడ చెన్నై'లో ప్రతినాయకులుగా నటించిన సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
'అర్థం' చిత్రీకరణ దాదాపుగా 50 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. నవంబర్ 7వ తేదీన పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్, చెన్నైలో మరో షెడ్యూల్ షూటింగ్ చేశాం. దాదాపుగా సగం సినిమా పూర్తయింది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 
 
మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనే ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. తెలుగులో 'ఖైదీ'కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాస్తున్నారు. సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి చక్కటి బాణీలు అందిస్తున్నారు" అని అన్నారు.
 
దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ "కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా - 'అర్థం'. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమా రూపొందుతోంది" అని అన్నారు. 
 
అజయ్, శ్రద్దా దాస్, ఆమని, మహేంద్ర, సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి, కె శివ సిద్ధార్థ్ , ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి, అసోసియేట్ నిర్మాత: ఉమా కూచిపూడి, సహా నిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, కూర్పు-రచన-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments