Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ బీచ్ రోడ్డు కార్ల నిండా పోలీసులు.. బిత్తరపోయిన జనం.. ఇంతకీ ఏం జరిగింది?

రయ్ ..రయ్ మంటూ దూసుకొచ్చిన కార్లు... అంతే జోరులో వాహనం నుండి దిగిన పోలీసులు... ఈ హడావుడి చూసి విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న‌ జనం బిత్తరపోయారు. అసలు ఏం జరిగింది... పోలీసులు ఎందుకు వచ్చారో..అసలు విషయం తెలుసు

Webdunia
శనివారం, 9 జులై 2016 (14:34 IST)
రయ్ ..రయ్ మంటూ దూసుకొచ్చిన కార్లు... అంతే జోరులో వాహనం నుండి దిగిన పోలీసులు... ఈ హడావుడి చూసి విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న‌ జనం బిత్తరపోయారు. అసలు ఏం జరిగింది... పోలీసులు ఎందుకు వచ్చారో..అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ హడావుడి అంతా చేసింది ఎవరో తెలుసా హీరో సూర్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సింగం-3 కోసమే ఇదంతా చేశాడు. ఇదంతా సినిమా షూటింగ్ కోసమే చేశారు.
 
నిజానికి సినిమా షూటింగ్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు, చుట్టూ మనుషులు, మేకప్ మ్యాన్, లైటింగ్, రెండు మూడు మేకప్ బస్సులు ఉంటాయి. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా అత్యాధునిక కెమెరాలను ఉపయోగించడం వల్ల ఇది సినిమా షూటింగ్ అనే విషయం తెలుసుకోవటానికే కొంత సమయం పట్టింది. షూటింగ్‌లో భాగంగా సూర్య ఎరుపు రంగు కారులో వచ్చి ఓ రౌడీని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి తరువాత కారులో వెళ్లిపోవాలి. ఇదీ సీన్. 
 
కానీ సూర్య తిరిగి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు కారు స్టార్ట్ కాలేదు. దీంతో మళ్లీ తెలుపు రంగు కారుతో సీన్‌ను రీషూట్ చేశారు. ఈ దృశ్యాన్ని డైరెక్టుగా వీక్షించిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments