Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను నిర్మించతలపెట్టిన ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం షూటింగ్

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (15:07 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను నిర్మించతలపెట్టిన ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం షూటింగ్ సజావుగా సాగేందుకు లక్ష్మీ పార్వతి సహకరించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏంటని అడిగారు.
 
‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా షూటింగ్‌‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా షూటింగ్ ‌చిత్రయూనిట్ ఆరంభించింది. అయితే, ఈ షూటింగ్‌కు తొలి రోజే అడ్డంకి ఎదురైంది. చిత్రయూనిట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో తాను అనుమతి తీసుకున్నానంటూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవంటూ షూటింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీసున్నామన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. 
 
తాను 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని వివరించారు. తన సినిమా పూర్తయిన తర్వాత, అది చూసిన తర్వాత లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులోనే తేల్చుకుంటానని దర్శకుడు కేతిరెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేదల పట్ల మరీ ఇంత క్రూరమా..? ఇంతేనా సీఎం యోగి పాలన అంటే? (Video)

అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇకలేరు..

ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక : సీఎం చంద్రబాబు ఆదేశం

హెచ్‌1 బీ వీసాలకు అనుకూలమే.. తేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments