Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' కూడా 'చెత్తబాస్' అవుతుందా? కమల్ 'బిగ్‌బాస్'పై విరుచుకుపడిన నటి

తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా కొనసాగుతున్న బిగ్ బాస్ షోను ఓ చెత్త షో అని తీవ్రంగా విమర్శలు చేసింది తమిళ సీనియర్ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్. ఇది ఓ చెత్త షో అంటూ తేల్చిన లక్ష్మి... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది విరుద్ధమని చెప్పారు. అంతేకాదు.

Webdunia
శనివారం, 8 జులై 2017 (18:04 IST)
తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా కొనసాగుతున్న బిగ్ బాస్ షోను ఓ చెత్త షో అని తీవ్రంగా విమర్శలు చేసింది తమిళ సీనియర్ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్. ఇది ఓ చెత్త షో అంటూ తేల్చిన లక్ష్మి... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది విరుద్ధమని చెప్పారు. అంతేకాదు... తనకు కూడా ఈ ఆఫర్ వచ్చిందనీ, రూ. 10 కోట్లు ఇచ్చినా ఇందులో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. 
 
ఈ షో దక్షిణాది ప్రజల మనోభావాలకు విరుద్ధమనీ, ముక్కుమొహం తెలియని వారితో ఎన్నో రోజులు కలిసి వుండటం తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేననీ, తనకు తెలిసినంతవరకూ దక్షిణాది ప్రజలు ఎవ్వరూ ఇలాంటి షోలను ఆదరించరని వెల్లడించారు. ఇలాంటి షోలతో వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయనీ, మన సంప్రదాయలను చేజేతులా చెడగొట్టుకునేవిధంగా ఈ షోలు వున్నాయని అభిప్రాయపడింది. 
 
మగా ఆడా తేడా లేకుండా ఒకే ఇంట్లో అలా రోజుల తరబడి వుండటం పాశ్చాత్య దేశాల్లోనూ, ఉత్తరాదిలోనూ సాధ్యమవుతుందేమో కానీ దక్షిణాదిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనీ, ఈ షో దక్షిణాదిలో క్లిక్ అవుతుందని తను అనుకోవడం లేదని తేల్చేసింది. ఆమె మాటలను చూస్తుంటే జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ కూడా ప్లాప్ అవుతుందనేట్లుగా వున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments