Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే రోజా..! ఊరుకో వాడిని గారు అంటావేంటి? పిల్లాడిగా ఉన్నప్పుడు ఎత్తుకున్నావ్..

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ప్రముఖ సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా సర్ ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఛానళ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (13:52 IST)
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ప్రముఖ సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా సర్ ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఛానళ్లకు ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. ఈ క్రమంలో చిరును ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా రోజా పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. 
 
ఇందులో భాగంగా 'మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారు కదా? ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారు?' అంటూ ప్రశ్నించింది. వెంటనే సమాధానం ఇచ్చిన చిరంజీవి... 'హే రోజా! ఊరుకో...వాడిని గారు అంటావేంటి?' అని వారించారు. 'పిల్లాడిగా వున్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు... చరణ్ అను చాలు' అని సూచించారు. 
 
తన బంగారు కోడిపెట్ట పాటను చెర్రీ రీమేక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆందోళన చెందాను. కానీ అద్భుతంగా స్టెప్పులేసి అదరగొట్టేశాడు.. దానిని చూసిన తరువాత చాలా గర్వపడ్డానని చిరంజీవి అన్నారు. తన కంటే ఎక్కువ సురేఖ సంతోషించిందని చెప్పుకొచ్చారు. ఈ పాటలో ఎవరు బాగా చేశారని సురేఖను అడిగితే.. 'ఇంకెవరు నా కొడుకే' అంటూ మురిసిపోయిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఎంతైనా తల్లీకొడుకులు కదా? అంటూ ఆయన నవ్వేశారు. దీంతో రోజా కూడా నవ్వుకున్నారు.  
 
పవన్ గురించి చెప్తూ.. పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్ అని చిరంజీవి తెలిపారు. వాడెప్పుడూ పెద్దగా మాట్లాడలేదని ఆయన అన్నారు. చరణ్ వాళ్ల బాబాయిని ఎప్పుడంటే అప్పుడు కలుస్తాడని చిరంజీవి చెప్పారు. రాంగోపాల్ వర్మ ట్రిక్కీ పర్సన్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఒకే ఇంట్లో ఒకరిని తిడతాడు, మరొకరిని పొగుడుతాడని ఆయన అన్నారు. రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడడం వేస్టు అని ఆయన చెప్పారు.
 
 ఆయనదొక సైకాలజీ అని, ఒకరిని పొగిడి మరొకర్ని తెగడడం కుత్సిత బుద్ధిని చూపిస్తుందని ఆయన అన్నారు. ఆయన మేధావితనం పెట్టి మంచి మంచి సినిమాలు చేయాలని ఆయన సూచించారు. పవన్ ను కూడా చాలా సార్లు కించపరిచాడని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments