వంశీ పైడిపల్లికి మరో షాక్, ఇంతకీ ఏమైంది?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (18:00 IST)
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబుతోనే సినిమా చేయాలనుకున్నారు. మహేష్‌ కూడా వంశీతో మరో సినిమా చేస్తానన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. అయితే... సరైన స్టోరీ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఆ తర్వాత నుంచి వంశీ పైడిపల్లి కథ రెడీ చేస్తూనే ఉన్నారు కానీ.. సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు.
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో సినిమా చేయాలనుకున్నారు. కథ రెడీ చేసారు.. రీసెంట్‌గా చరణ్‌కి నెరేషన్ ఇచ్చారు. అయితే... కథ విని చరణ్ ఓకే చెప్పలేదట. దీంతో వంశీ పైడిపల్లికి మరో షాక్ తగిలింది. స్టార్ హీరోల్లో ఒక్క చరణ్ మాత్రమే ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమాని కన్ఫర్మ్ చేయలేదు. మిగిలిన హీరోలందరూ ప్రాజెక్ట్ ఓకే చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
 
అందుచేత ఇప్పుడు వంశీ ముందున్న తక్షణ కర్తవ్యం చరణ్‌ కోసం మరో కథను రెడీ చేయడమే. అయితే.. చరణ్‌ దగ్గర గట్టి పోటీ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుములతో చరణ్ తదుపరి చిత్రం విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం. మరి.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments