'దొరసాని'కి బంపర్ ఆఫర్లు.. ఇటు తెలుగు.. అటు తమిళం...

Webdunia
బుధవారం, 12 మే 2021 (08:49 IST)
టాలీవుడ్ సినీ దంపతులు డాక్టర్ రాజశేఖర్, జీవితా రాజశేఖర్ ముద్దుల కుమార్తెల్లో ఒకరైన శివానీ రాజశేఖర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తన తొలి చిత్రం దొరసాని ఒకింత నిరాశపరిచినప్పటికీ... ఈమెకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
తెలుగులో ప్రస్తుతం ఈ యువనాయకి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' చిత్రంతో పాటు తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తమిళంలో హిప్‌హాప్‌ తమిళ సరసన ఓ సినిమా చేస్తోంది. 
 
తాజాగా శివానీ రాజశేఖర్‌ తమిళంలో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. 
 
ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అరుణ్‌రాజ కామరాజ్‌ దర్శకుడు. బోనీకపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శివానీరాజశేఖర్‌ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments