Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

చిత్రాసేన్
శుక్రవారం, 10 అక్టోబరు 2025 (17:09 IST)
Premaku namaskaram - Shivaji
ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే  యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ప్రేమకు నమస్కారం' ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ వచ్చిన స్పందన అనూహ్యం. 
 
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ  సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 'మహాదేవ నాయుడు'గా ఆయన చాలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా శుక్రవారం మహాదేవ నాయుడు పాత్రకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడయోను చూస్తే ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో తెలుస్తోంది. ప్రముఖ నటి భూమిక మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రావాడ,  భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ఈ  చిత్రానికి వి. భీమ శంకర్‌ దర్శకుడు.
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్‌ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్‌, బ్రేకప్‌అప్‌, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్‌ అయ్యే కథ ఇది. ఈ చిత్రంలో నటుడు హీరో శివాజీ పాత్రలో ఎంతో కీలకంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం కనిపించే పాత్ర ఇది. ఆయన పాత్రలో కామెడీ, ఎమోషన్‌, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కోర్టు సినిమాలో ఆయనకు ఎంతో పేరు వచ్చిందో ఈ సినిమాలో అంతకు మించిన పేరు వస్తుంది. ఆయన పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. మహాదేవ నాయుడుగా ఆయన నట విశ్వరూపం చూస్తారు' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ '' వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. కొత్తదనం, హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌మెంట్‌ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. శివాజీ గారి పాత్ర ఆయన కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మహాదేవ నాయుడు పాత్రకు అందరికి నచ్చే విధంగా ఉంటుంది. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments