రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (11:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తెలుగు చిత్రం 'దసరా'లో ప్రతినాయకుడుగా నటించిన షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో దుర్మరణం పాలయ్యారు. షైన్ టామ్ చాకో, ఆయన తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. 
 
శుక్రవారం జరిగిన వివరాలను పరిశీలిస్తే, తెల్లవారుజామున షైన్ టాన్ చాకో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, డ్రైవర్‌తో కలిసి వారు ప్రయాణిస్తుండగా ధర్మపురి సమీపంలోని సేలం - బెంగుళూరు రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందు వైపు వెళుతున్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాద తీవ్రత చాలా తీవ్రంగా జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలపైన సీపీ చాకో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలిసిన మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ, షైన టామ్ చాకో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments