మీడియాకు షాకిచ్చిన శిల్పాశెట్టి.. ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:53 IST)
పోర్న్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసి షాకిచ్చింది.

తనకు, తన భర్త ప్రతిష్టకు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన ఫొటోలు, వీడియోలు వాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కింది. 
 
జాతీయ మీడియాతోపాటు పలువురు జర్నలిస్టులపై కూడా పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, పరువునష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
 
పోర్న్ కేసులో శిల్పా శెట్టి భర్తను అరెస్ట్‌ చేయడంతో బాలీవుడ్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. కొందరు మహిళలను భయపెట్టి పోర్న్ చిత్రాలను తీసి, వాటిని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు రాజ్‌కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జులై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా.. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.
 
ఇలాంటి సమాచారం ప్రచురించకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిరోధించాలని పిటిషన్‌లో కోరింది. కాగా, ముంబై హైకోర్టు ఆయా ప్లాట్‌ఫాంలను నిరోధించేందుకు నిరాకరించింది. అయితే శిల్పా శెట్టి పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారని, సెలబ్రెటీ అయిన వారిపై ఇలాంటి కథనాలు ప్రచురించ కూడదని ఆమె తరుపున హాజరైన లాయర్ బిరెన్ సారాఫ్ కోర్టుకు విన్నవించాడు.
 
ఈ మేరకు కోర్టు మేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా మీడియాలో ఇలాంటి కథనాలపై ఎలాంటి ప్రకటన జారీ చేయడం లేదని బదులిచ్చినట్లు సమాచారం. అయితే, శిల్పాశెట్టి కోర్టును ఆశ్రయించడంతో చాలా వీడియోలను సోషల్ మీడియాలో తొలగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం